Monday, April 29, 2024

విజయవంతంగా పీఎంయువై అమలు.. ఎంపీ సత్యవతి ప్రశ్నలకు కేంద్రమంత్రి బదులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద పేద మహిళలకు 8 కోట్ల ఎల్పీజీ కనెక్షన్ అందించాలనే లక్ష్యం కాల పరిమితి కంటే ముందే సాధించామని కేంద్రం సంతోషం వ్యక్తం చేసింది. స్వచ్ఛమైన వంట ఇంధనం, గాలి నాణ్యతను మెరుగుపరచడానికి పట్టణ మురికివాడలలో ఎల్పీజీ వినియోగాన్ని పెంచడానికి, ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని అనకాపల్లి వైసీపీ ఎంపీ డాక్టర్ సత్యవతి అడిగిన ప్రశ్నలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి రామేశ్వర్ తేలి గురువారం స్పందించారు.

ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులందరికీ ఉచితంగా మొదటి రీఫిల్, స్టవ్ అందిస్తారని తెలిపారు. వలస కుటుంబాలు, చిరునామా, రేషన్ కార్డుకు బదులుగా స్వీయ-డిక్లరేషన్‌తో కొత్త కనెక్షన్‌ని పొందేందుకు ప్రత్యేక సదుపాయం కల్పించామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement