Friday, October 11, 2024

Street Fight – లండ‌న్ లో మామిడి పళ్ల కోసం సిగ‌ప‌ట్లు – వీడియోతో

లండ‌న్ – మామిడిపండ్లు ఇష్టపడని వారు వుండరు. ఎంత రేటైనా సరే కొనుక్కుని సీజన్ లో వాటిని ఓ పట్టుపడతారు. అయితే, ఇలాంటి మామిడి పండ్ల కోసం తన్నుకున్న సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌ లండన్ మహానగరంలో జరగడం ఇక్కడ విశేషం!

ఈ వీడియోలో కొందరు మామిడి పళ్లు చేజిక్కించుకునే ప్రయత్నంలో ఒకరిపై మరొకరు దాడికి దిగారు. చేతికి అందిన వస్తువులతో కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఓ మహిళ కూడా తగ్గేదేలేదంటూ ఈ గొడవలోకి దిగింది. అవతలి వ్యక్తిని అమాంతం తోసేసింది. గొడవ జరుగుతున్న ప్రాంతంలో నేల తడిగా ఉండటంతో కొందరు జారి పడ్డారు కూడా. ఇంత‌కీ మామిడిపండ్ల కోసం ఇంతిలా కొట్టేసుకుంది పాకిస్థాన్ వాసుల‌ను తేలింది.. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement