Monday, April 29, 2024

Story : త్రిష‌ @20ఇయ‌ర్స్.. విషెష్ చెబుతోన్న సెల‌బ్రిటీలు.. ఫ్యాన్స్

త్రిష ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రేమో. వ‌ర్షం చిత్రంతో తిరుగులేని హీరోయిన్ గా పేరుగాంచింది. ఈ చిత్రం త‌ర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి, స్టాలిన్, బుజ్జిగాడు, కింగ్, నమో వెంకటేశా, లయన్ లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో పాటు మరిన్ని సినిమాల్లో నటించింది. మరోవైపు తమిళంలోనూ జోరుగా సినిమాలు చేస్తూనే వచ్చింది. తెలుగు, తమిళ చిత్రాల్లో త్రిష ఎక్కువగా నటించింది. దీంతో ఈరెండు భాషల ప్రేక్షకుల్లో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. ఫ్యామిలీ హీరోయిన్ గా పెరు సంపాదించుకుంది. అలాగే గ్లామర్ ఒళకబోస్తూ యూత్ లోనూ గట్టి ఫాలోయింగ్ ను సాధించింది.

సీనియర్ హీరోయిన్ గా ఇప్పటికీ సినీ ఆఫర్లను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. నేటితో త్రిష ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. దీంతో అభిమానులు, సినీ ప్రముఖుల, సెలబ్రెటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె బ్యూటీని పొగుడుతూ త్రిష త్రోబ్యాక్ పిక్స్ ను షేర్ చేస్తున్నారు. 2016 తర్వాత త్రిషకు పెద్దగా హిట్లు లేవు. 6ఏళ్ల తర్వాత రీసెంట్ గా ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్ 1’తో హిట్ అందుకొని మళ్లీ ప్రేక్షకులను మెప్పించింది. ఇలాంటి భారీ ప్రాజెక్ట్ లో త్రిష హీరోయిన్ గా నటించడం పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు.

- Advertisement -

ఇండస్ట్రీలో త్రిషను ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రమే మళ్లీ నిలబెట్టిందంటూ పోస్టుల పెడుతున్నారు. 2 Decades Of South Queen Trisha అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లోకి తెచ్చారు. దాంతో త్రిష కూడా తనకు విష్ చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా స్పెషల్ పోస్ట్ పెట్టింది. దక్షిణాది హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయినందుకు సంతోషంగా ఉంద‌ని తెలిపింది. ప్రస్తుతం త్రిష ‘సతురంగ వేట్టై పార్ట్ 2’, ‘రామ్ పార్ట్ 1’, పొన్నియిన్ సెల్వన్ 2, ది రోడ్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌ని గ్లామ‌ర్ తో యంగ్ హీరోయిన్ ల‌కి పోటీగా నిలుస్తోంది త్రిష‌. ఈమె అందాన్ని ఎంత‌పొగిడినా త‌క్కువే అంటున్నారు ఆమె ఫ్యాన్స్. కాగా త్రిష మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుందాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement