Wednesday, April 17, 2024

ఎల్‌అండ్‌టీ సుఫిన్‌ డిజిటల్‌ దిశగా అడుగులు.. ఈ-కామర్స్‌ వేదిక ఏర్పాటు

ముంబైహైటెక్‌ తయారీ, సేవల రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న భారతీయ బహుళ జాతి సంస్థ లార్సన్‌ అండ్‌ టర్బో సోమవారం బీ2బీ పారిశ్రామిక ఉత్పత్తులు, సేవల కోసం సమగ్రమైన ఈ-కామర్స్‌ వేదిక ఎల్‌అండ్‌టీ సుఫిన్‌ను విడుదల చేసింది. దాదాపు 80 ఏళ్ల అనుభవంపై ఆధారపడటంతో పాటు దేశ విశ్వాసం ప్రధాన బలం కలిగిన ఎల్‌ అండ్‌ టీ కామర్స్‌ వేదిక ద్వారా వ్యాపారాలను మరీ ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలకు తగిన శక్తి అందించడం ద్వారా దేశ వ్యాప్తంగా డిజిటల్‌గా పారిశ్రామిక సరఫరాలను ఎంచుకునే వీలు కల్పిస్తుంది. పారిశ్రామిక సరఫరా చైన్స్‌ వ్యాప్తంగా భారతీయ తయారీ పర్యావరణ వ్యవస్థ గణనీయమైన రీతిలో సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టీ సీఈఓ అండ్‌ ఎండీ ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యన్‌ (ఎస్‌ఎన్‌ఎస్‌) మాట్లాడుతూ.. ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశం మారుతున్న వేళ, సరఫరా చైన్‌ను డిజిటలీకరించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా మొత్తం మీద భారతీయ పరిశ్రమలు మరీ ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు అంతర్జాతీయంగా పోటీ పడేందుకు సైతం వీలు కలుగుతుందని స్పష్టం చేశారు.

డిజిటల్‌ రంగంలో ఘనత..

ఎల్‌అండ్‌టీ సుఫిన్‌ ఆవిష్కరణతో.. తమ డిజిటల్‌ పరివర్తన ప్రయాణంలో మరో మైల రాయి జోడించామన్నారు. తమ నమ్మకం, ఈ పర్యావరణ వ్యవస్థను లోతుగా అర్థం చేసుకోవడం ఆధారంగా.. దీన్ని తీర్చిదిద్దుతామని వివరించారు. పారిశ్రామిక ఉత్పత్తుల కోసం బీ2బీ మార్కెట్‌ ప్రాంగణాన్ని సమూలంగా ఎల్‌అండ్‌టీ సుఫిన్‌ మార్చగలదనే విశ్వాసంతో ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. టైర్‌ 1, టైర్‌ 2 నగరాలు, అంతకుమించి ఉన్న వినియోగదారులకు సైతం సులభంగా అందుబాటులో ఉండేలా, సౌకర్యవంతంగా, పారదర్శకంగా ఉండేలా చేయడం తమ లక్ష్యం అన్నారు. తద్వారా సమాన అవకాశాలను సృష్టించి.. అన్ని వ్యాపారాలకు సమ్మిళిత వృద్ధిని అనుమతించనుందని తెలిపారు.

ఎంపిక కోసం 40 విభాగాలు..

ఎల్‌అండ్‌టీ సుఫిన్‌ విస్తృత శ్రేణిలో ఎంపికలను 40 విభాగాలుగా పారిశ్రామిక ఉత్పత్తులను ఎంచుకునే అవకాశం అందిస్తుందన్నారు. వీటితో పాటు అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేసిన భాగస్వాముల నుంచి ఫైనాన్సింగ్‌, లాజిస్టిక్స్‌ మద్దతు సైతం అందిస్తుందని తెలిపారు. విక్రేతల కోసం ఎల్‌ండ్‌టీ సుఫిన్‌ ఇప్పుడు తమ మార్కెట్‌లో ఎన్నడూ లేనంతగా విస్తరించే అవకాశం అందిస్తుందని, ఈ ప్లాట్‌ఫామ్‌ను విభిన్న విభాగాల వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా చేరుకునేలా తీర్చిదిద్దామని వివరించారు. ఇది వ్యాపార సంస్థలకు పూర్తి స్థాయిలో సెల్లర్‌ టూల్స్‌, డెలివరీ, బేర సారాలను ఒకే వేదిక వద్ద అందిస్తుందని, అత్యంత సురక్షితమైన వేదికగా తీర్చిదిద్దబడిన ఎల్‌అండ్‌టీ సుఫిన్‌, ఎల్‌అండ్‌టీతో ధృవీకరించబడిన కేవైసీ ధృవీకృత విక్రేతలను, కొనుగోలుదారులను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement