Thursday, April 25, 2024

Big Story: ఆర్థిక అరాచకంతోనే శ్రీలంక సంక్షోభం.. విచ్చలవిడిగా అవినీతి, అనాలోచిత నిర్ణయాలు

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ప్రజలు ఆగ్రహంతో వీధుల్లో వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఏకంగా అధ్యక్ష భవనాన్నే చుట్టుముట్టారు. ప్రజల ఆగ్రహా న్ని గమనించిన ఆ దేశ అధ్యక్షుడు దేశం వదిలిపారిపోయారు. ప్రధాన మంత్రి ఇంటికి సైతం ఆందోళనకారులు నిప్పుు పెట్టారు. ఆయన కూడా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గత నెలలోనే ప్రధాన మంత్రి దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ప్రకటించారు. రుణాలకు వడ్డీలు సైతం కట్టలేని పరిస్థితి. ఆహారం, ఇంధన కొనుగోలుకు సైతం డబ్బులు లేని పరిస్థితికి ఆ దేశం చేరుకుంది. భారత్‌, చైనా, ఐఎంఎఫ్‌ను సహాయం చేయాల్సిందిగా ప్రధాన మంత్రి కోరారు.
ప్రధాన మంత్రిగా ఈ సంవత్సరం మే నెలలో బాధ్యతలు స్వీకరించిన రాణల్‌ విక్రమ సింఘే, అధ్యక్షుడు గొటబాయి రాజపక్సే పరిస్థితిని చక్కదిద్దలేకపోయారు. ప్రజాఆగ్రహంతో పదవుల నుంచి తప్పుకునేందుకు అంగీకరించారు. ఎందుకు శ్రీలంక్ష ఆర్థిక వ్యవస్థ ఇంతటి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశంలో సామాన్య ప్రజలు కనీసం రెండుపూటలు భోజనం చేయలేని ధీన స్థితికి పాలకుల విధానలే కారణం. వారి విధానాలతో ఇలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?

అనేక కారణాలు ఇందుకు కనిపిస్తున్నాయని ఆర్థిక వేత్తలు అభిప్రాపడుతున్నారు. 51 బిలియన్‌ డాలర్ల రుణాలు ఉన్నాయి. వాటిపై వడ్డీ సైతం చెల్లించలేమని శ్రీలంక చేతులెత్తేసింది. శ్రీలంక ప్రధాన ఆదాయ వనరు టూరిజం. టెర్రర్‌ దాడులు, కోవిడ్‌ మూలంగా ఈ రంగం పూర్తిగా కుదేలైంది. దేశ కరెన్సీ విలువ 80 శాతం తగ్గిపోయింది. దీంతో ఎగుమతుల కోసం ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది. ద్రవ్యోల్బణం 57 శాతానికి చేరుకుంది. సామాన్యులు ఏదీ కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో వాటి ధరలు పెరిగాయి. కనీసం గ్యాసోలిన్‌, పాలు, కుకింగ్‌ గ్యాస్‌ వంటి నిత్యావసరాల దిగుమతికి కూడా డబ్బులు చెల్లించని స్థితి ఏర్పడింది.

రాజకీయ అవినీతి..

శ్రీలంకలో రాజకీయ అవినీతి అంతులేకుండా పెరిగిపోయింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేశారు. దేశ సంపద అవినీతి మూలంగా వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ కోలుకోలేని పరిస్థితికి నెట్టబడింది. అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, ఆ దేశ ఆర్థిక మంత్రి ఇలా అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు అధికారాలన్నీ వీరి చేతుల్లోనే ఉన్నాయి. దేశానికి ప్రధాన ఆదాయ వనరులన్నీ వీరి శాఖల కిందే ఉన్నాయి. ఈ కుటుంబ అంతులేని అవినీతి మూలంగానే దేశం ఇలాంటి దారుణ పరిస్థితికి చేరిందని ఇప్పుడు ఆర్థిక వేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. వీరు తీసుకున్న పలు అనాలోచిత నిర్ణయాలు కూడా శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీసిందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

ప్రజలపై నేరుగా ప్రభావం..

శ్రీలంకలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్ని సంవత్సరాలుగా ఆ దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయం వల్ల నేడు కనీసం తిండికి కూడాఇబ్బంది పడుతున్నారు. ఐక్యరాజ్యసమితి ఫుడ్‌ ప్రోగ్రాం ప్రకారం శ్రీలంకలో 10 కుటుంబాల్లో 9 ఒక పూట భోజనాన్ని చేయలేకపోతున్నాయి. ప్రస్తుతం 30 లక్షల మంది అత్యవసర మానవతా సాయం కింద ఆహారం సరఫరా పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు వెతుక్కోవాలని భావిస్తున్నారు. పాస్‌ పోర్టుల కోసం పెరుగుతున్న దరఖాస్తులే ఇందుకు నిదర్శనమని ఒక అధికారి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఒక రోజు అధనంగా మూడు నెలలు సెలవు ఇచ్చారు. వీరంతా గ్రామాలకు వెళ్లి ఆహారధాన్యాలు పండించాలని ప్రభుత్వం ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement