Friday, May 10, 2024

స్ఫుత్నిక్-వి ఉత్పత్తి కేంద్రంగా భారత్..!

కరోనా వ్యాక్సిన్ల కొరతతో అల్లాడుతున్న దేశ ప్రజలకు రష్యా ఆర్‌డీఐఎఫ్ ఆవిష్కరించిన `స్ఫుత్నిక్-వి` వ్యాక్సిన్ ఇటీవల అందుబాటులోకి వచ్చింది. ఈ టీకాను భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సంస్థ పంపిణీ చేస్తోంది. రెడ్డీస్‌తో మాత్రమే కాకుండా కొన్ని ఇతర ఫార్మా కంపెనీలతో కూడా ఆర్‌డీఐఎఫ్ టీకా తయారీకి ఒప్పందాలు చేసుకుంది. ఈ కంపెనీలు త్వరలోనే టీకా ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. ఉత్పత్తి సామర్థ్యం భారత్‌లో అధికంగా ఉండడంతో మన దేశాన్నే `స్ఫుత్నిక్-వి` టీకా ఉత్పత్తి కేంద్రంగా చేయాలని ఆర్‌డీఐఎఫ్ భావిస్తోంది. ప్రస్తుతం మనదేశంలో ఈ టీకా ఒక డోసును జీఎస్టీతో కలిపి రూ.995కు విక్రయిస్తోంది. మరో మూడు నెలల్లో ఈ ధర తగ్గనుందట. దేశీయంగా ఈ టీకా ఉత్పత్తి ప్రారంభం కావడమే దీనికి కారణం. ఇక ఒప్పందాలు కుదుర్చుకున్న అన్ని సంస్థల్లో ఉత్పత్తి ప్రారంభమయ్యాక ఇక్కడి అవసరాలకు సరిపడా టీకాలను అందించడంతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement