Monday, April 29, 2024

క్లాసెన్ ఊర‌మాస్ ఇన్నింగ్స్.. చెల‌రేగిన సౌత్ఆఫ్రికా

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవ్వాల (శ‌నివారం) ముంబైలోని వాంక‌డే స్టేడియంలో ఇంగ్లాండ్, సౌత్ఆఫ్రికా మ్యాచ్ జ‌రుతొంది. కాగా, మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ఆఫ్రికా జ‌ట్టు ఇంగ్లండ్ ఔల‌ర్ల‌ను ఉతికారేసింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 399 పరుగులు చేసింది.

కాగా, సౌత్ఆఫ్రికా బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్ (109) సెంచ‌రీతో చెల‌రేగాడు. హెండ్రిక్స్ (85), వాన్ డెర్ డస్సెన్ (60), మార్కో జాన్సెన్ (75) హాఫ్ సెంచ‌రీల‌తో మెరుపులు మెరిపించారు. ఇక, మార్క్‌రామ్ (42) ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నాడు. దీంతో సౌత్ఆఫ్రికా స్కోర్ భారీగా వెల్లంది.

ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో రీస్ టాప్లీ 3 వికెట్లు తీసాడు., ఇక ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీయగా.. గుస్ అట్కిన్సన్ కూడా రెండు వికెట్ ద‌క్కించుకున్నాడు. ఇక ఇంగ్లండ్ జ‌ట్టు విజ‌లక్షాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవ‌ర్లలో 400 ప‌రుగులు చేయాల్సిం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement