Monday, October 14, 2024

సోనూసూద్ మరో సంచలన నిర్ణయం

కరోనా కష్టకాలంలో నటుడు సోనూసూద్ ఎంతో మంది పాలిట దేవుడిలా మారాడు. డబ్బును ఏ మాత్రం లెక్క చేయకుండా నిర్విరామంగా.. కష్టాలలో ఉన్నవారిని ఆదుకుంటున్నాడు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో సోనూసూద్ చేస్తున్న సహాయ కార్యక్రమాలు ఎందరో ప్రాణాలను కాపాడుతున్నాయి. మరోవైపు ఆక్సిజన్ ప్లాంట్లను జెట్ స్పీడ్‌లో నిర్మించి ఎంతోమందికి ఊపిరి పోస్తున్నాడు. ఇప్పుడు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు.

దేశంలో ఎవరు ఎంత దూరం నుంచి అడిగినా కూడా ఆక్సిజన్ సిలిండర్ పంపేలా సోనూసూద్ బృందం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాన్-ఇండియా స్థాయిలో ఎవరికి అవసరం ఉన్నా.. ఉచితంగా ఆక్సిజన్ పంపిణీ చేసేందుకు ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. umeedbysonusood.com వెబ్‌సైట్‌‌లో ఆక్సిజన్ ఎక్కడికి పంపాలో చెబితే.. డిటిడిసి ద్వారా అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్ పంపబడతాయని సోనూసూద్ తెలియజేశారు. సోనూసూద్ ఈ నిర్ణయంతో.. సర్వత్రా ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement