Friday, May 10, 2024

ప‌ల్లి ప‌ల్లి బెల్లంప‌ల్లి….

కన్నడ స్టార్‌ ఉపేంద్ర హీరోగా తాజా సినిమా ‘కబ్జ’. పునీ త్‌ రాజ్‌కుమార్‌ జయంతి సందర్భంగా మార్చి 17న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో వవిడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు, టీ-జర్‌ విడుదలయ్యాయి. తాజాగా మూడవ గీతంగా ”పల్లి పల్లి బెల్లంపల్లి..” అనే పాటను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.
తొలి పాటను హైదరాబాద్‌, రెండో పాటను చెన్నైలఈ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడవ పాటను దర్శకుడు, నిర్మాత ఆర్‌.చంద్రు తన హోం టౌన్‌ షిడ్ల గట్టలో భారీ ఎత్తున వేడుక నిర్వహించి ప్రేక్షకుల సమక్షంలోనే శాండిల్‌ వుడ్‌ కింగ్‌ శివ రాజ్‌కుమార్‌ చేతుల మీదుగా విడుదలైంది. హెల్త్‌ మినిష్టర్‌ కె.సుధాకర్‌, మాజీ మంత్రి హెచ్‌.ఎం.రెవన్న, నిర్మాత, డిస్ట్రిబ్య్రూటర్‌ ఆనంద్‌ పండిట్‌, కోప్రొడ్యూసర్‌ అలంకార్‌ పాండియన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘పల్లి పల్లి బెల్లంపల్లి’ అంటూ సాగే పక్కా మాస్‌ సాంగ్‌. ఉపేంద్ర, తాన్యా హోప్‌ ఈ పాటలో నర్తించారు. కె.జి.యఫ్‌ ఫే మ్‌ రవిబస్రూర్‌ సంగీతం అందించిన పాటను తెలుగులో చం ద్రబోస్‌ రాయగా హరిణి ఇవ్వటూరి, సంతోష్‌ వెంకీ పాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement