Thursday, May 2, 2024

Smart Exclusive – సెర్విక‌ల్ కేన్సర్​ … ప్రాణాలు తీస్తుందా? – 32 ఏళ్లకే చనిపోతారా…

ఈ కేన్స‌ర్‌ వ‌ల్ల ప్రమాదం ఎంత
పూన‌మ్ పాండే చ‌నిపోయిన‌ట్టు ప్ర‌చారం
తాను బ‌తికే ఉన్న‌ట్టు వీడియో రిలీజ్‌
దేశ‌మంతా ర‌చ్చ‌.. అంతటా ఇదే చ‌ర్చ‌
వైద్య నిపుణులు చెబుతున్న విష‌యాలేంటి
ఈ కేన్స‌ర్‌ని తొలినాళ్ల‌లో గుర్తించడం ఎలా
చికిత్స ఉందా.. జాగ్ర‌త్త‌లు ఏమిటి?
వైద్య నిపుణులు డాక్ట‌ర్ నంద‌కిషోర్ సూచ‌న‌లు

గర్భాశయ కేన్సర్ ప్రారంభ దశలలో ఎటువంటి లక్షణాలను కలిగి ఉండకపోవచ్చు. కొన్నిసార్లు కటి (ప్రైవేటు పార్ట్‌) ప్రాంతంలో నొప్పి, పీరియడ్స్ మధ్య రక్తస్రావం, బలమైన వాసనతో కూడిన యోని స్రావాలవంటివి కనిపిస్తాయి. గర్భాశయ కేన్సర్‌కు కారణం హ్యూమన్ పాపిల్లోమా వైరస్. గర్భాశయ కేన్సర్ రాకుండా ఉండాలంటే టీనేజ్ వయసు అమ్మాయిలకు వ్యాక్సిన్ వేయడం ద్వారా నివారించవచ్చు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రారంభంలో 9-26 సంవత్సరాల వయస్సు గల వారందరికీ దీని నివార‌ణ‌కు వ్యాక్సిన్‌ని సిఫార్సు చేసింది.

గర్భాశయ కేన్సర్ ప్రాథమిక లక్షణాలు
పెల్విక్ అంటే కటి (ప్రైవేట్ పార్ట్‌) భాగంలో నొప్పి గర్భాశయ కేన్సర్ ప్రాథమిక లక్షణాల్లో ముఖ్యమైనది. మరికొంతమందిలో గర్భాశయ కేన్సర్ ప్రారంభ దశలలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే, ఒక వయసు దాటిన త‌ర్వాత‌ మహిళలు క్రమం తప్పకుండా గర్భాశయ స్మెర్ పరీక్షలు.. లేదా పాప్ స్మియర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా కేన్సర్ కణాలు ఏవైనా అభివృద్ధి చెందుతున్నాయా గుర్తించే వీలు క‌లుగుతుంది. దీంతో ముందుగానే కేన్సర్ నివారణకు.. చికిత్సకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

గర్భాశయ కేన్సర్‌లో కనిపించే సాధారణ లక్షణాలు:

పీరియడ్స్ మధ్య రక్తస్రావం
లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం
రుతుక్రమం ఆగిపోయిన (మెనోపాజ్) మహిళల్లో రక్తస్రావం
లైంగిక సంపర్కం సమయంలో అసౌకర్యం
బలమైన వాసనతో యోని ద్రవాలు
యోని ద్రవాలు రక్తంతో నిండి ఉండడం
కటి (ప్రైవేట్ పార్ట్‌) ప్రాంతంలో నొప్పి
ఈ లక్షణాలు కనిపిస్తే.. గర్భాశయ కేన్సర్‌తో పాటు ఇతర వేరే సమస్యలు కూడా ఉండొచ్చు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

సర్వైకల్ కేన్సర్ : కారణాలు, లక్షణాలు, చికిత్స… మహిళలు తెలుసుకోవాల్సిన విషయాలివే.
గర్భాశయ కేన్సర్ ఎన్ని దశల్లో ఉంటుంది.. ఏ దశలో గుర్తించవచ్చు… అనేది ఇప్పుడు చాలామంది తెలుసుకోవాల్సి ఉంటుంది. కేన్సర్ ఏ దశలో ఉందో గుర్తిస్తే క‌నుక‌ చికిత్స అంత సులభం అవుతుంది. కేన్సర్ ఎంతవరకు వ్యాపించిందో, సమీపంలోని అవయవాలు లేదా దూరంగా ఉన్న అవయవాలకు చేరుకుందో లేదో అంచనా వేయడమే దశల లక్ష్యం.

- Advertisement -

గర్భాశయ కేన్సర్‌ను నాలుగు దశల్లో గుర్తిస్తారు.

స్టేజ్‌ 0 : క‌ఏన్సర్‌కు పూర్వ కణాలు ఉన్నాయా.
స్టేజ్‌ 1 : క‌ఏన్సర్ కణాలు ఉపరితలం నుండి గర్భాశయంలోని లోతైన కణజాలాలలోకి, బహుశా గర్భాశయంలోకి, సమీపంలోని శోషరస కణుపులకు పెరిగాయి.
స్టేజ్‌ 2 : కేన్సర్ గర్భాశయం దాటి వెళ్లింది. కానీ, కటి గోడలు లేదా యోని దిగువ భాగం వరకు చేరుకోలేదు. ఇది సమీపంలోని శోషరస కణుపులను ప్రభావితం చేయవచ్చు.
స్టేజ్‌ 3: కేన్స‌ర్ కణాలు యోని దిగువ భాగంలో, గోడలలో ఉంటాయి. ఇది మూత్రాశయం నుండి మూత్రాన్ని తీసుకువెళ్లే మూత్ర నాళాలను అడ్డుకుంటుంది. సమీపంలోని శోషరస కణుపులను ప్రభావితం చేయవచ్చు.
స్టేజ్ 4: కేన్సర్.. మూత్రాశయం లేదా పురీషనాళాన్ని ప్రభావితం చేస్తుంది. పెల్విస్ నుండి పెరుగుతుంది. శోషరస కణుపులను ప్రభావితం చేయవచ్చు.
ఇక‌.. 4వ స్టేజ్‌లోనే కాలేయం, ఎముకలు, ఊపిరితిత్తులు, శోషరస కణుపులతో సహా సుదూర అవయవాలకు వ్యాపించిందా లేదా అన్న‌ది తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.

ఎందుకు వస్తుంది:
కేన్సర్ అనేది కణాల అనియంత్రిత విభజన.. అసాధారణ కణాల పెరుగుదల ఫలితంగా వస్తుంది. మన శరీరంలోని చాలా కణాలకు నిర్దిష్ట జీవితకాలం ఉంటుంది. అవి చనిపోయినప్పుడు, వాటిని భర్తీ చేయడానికి శరీరం కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే.. మృతకణాలు విభజన చెందుతూ పెరుగుతాయి. అలాంటప్పుడు ఇది కణాల అధిక పెరుగుదలకు దారితీస్తుంది. చివరికి కణితిగా మారి కేన్సర్ కారకంగా తయారవుతంది. కణాలు కేన్సర్‌గా ఎందుకు మారతాయో శాస్త్రవేత్తలకు పూర్తిగా తెలియదు.

గర్భాశయ కేన్సర్ రావడానికి గల కారణాలు:
గర్భాశయ కేన్సర్‌కు కారణమైన వైరస్ హెచ్‌పీవీ (Human papilloma virus). ఇది లైంగికంగా సంక్రమించే వైరస్. 100 కంటే ఎక్కువ రకాల హెచ్‌పీవీలు ఉన్న‌ట్టు డాక్ట‌ర్‌లు చెబుతున్నారు. వీటిలో కనీసం 13 వైరస్‌లు గర్భాశయ కేన్సర్‌కు కారణం కావచ్చు.

ఈ వైరస్ సోకడానికి గ‌ల కార‌ణాల‌ను వైద్య నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.
చాలా మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం
లేదా పెళ్లికంటే ముందుగానే లైంగికంగా చురుకుగా ఉండటం
హెచ్‌పీవీ ఉన్న వ్యక్తితో లైంగిక సంబంధం

ధూమపానం: ఇది గర్భాశయ కేన్సర్‌తో పాటు ఇతర రకాల ప్రమాదాన్ని పెంచుతుంది.
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ : హెచ్‌ఐవీ, ఎయిడ్స్ ఉన్నవారిలో, లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తులలో గర్భాశయ కేన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
జనన నియంత్రణ మాత్రలు : సాధారణ గర్భనిరోధక మాత్రల దీర్ఘకాలిక ఉపయోగిస్తున్న స్త్రీలలో కూడా ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.
ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STD) : క్లామిడియా, గనేరియా, సిఫిలిస్ వంటి వాటితో కూడా గర్భాశయ కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంది.
సామాజిక-ఆర్థిక స్థితి: సరైన పోషకాహారం, అపరిశుభ్రతలాంటివి కూడా దీనికి కారణం కావచ్చు.

చికిత్స:
గర్భాశయ క్యాన్సర్ చికిత్సకు శస్త్రచికిత్స, రేడియోథెరపీ, కీమోథెరపీ.. వీటన్నింటితో చేస్తారు. దీనికి గుర్తించడానికి రొటీన్ స్క్రీనింగ్‌గా ACSను డాక్టర్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తుంది.

అయితే.. ఈ స్క్రీనింగ్‌ను 25 ఏళ్లలోపు ఉన్నవారికి సిఫార్సు చేయదు.

25-65 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ అయిన హెచ్‌పీవీ పరీక్షను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి.

65 ఏళ్లు పైబడిన వారు : 65 ఏళ్లు పైబడిన వారికి ఈ పరీక్షలు చేయరు. అయితే.. గతంలో స్క్రీనింగ్ చేయించుకుని, గర్భాశయ కేన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటే తప్ప.. ACS స్క్రీనింగ్‌ను 65ఏళ్లు పైబడిన వారికి చేయరు.

30, 65 సంవత్సరాల మధ్య మహిళలు : ఈ వయస్సు గల మహిళలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పాప్ పరీక్ష, HPV పరీక్ష చేయించుకోవాలి. అయితే, సాధారణంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. ఇందులో ఏదైనా తేడా ఉంటేనే HPV పరీక్ష చేయించుకోవాలి.

యువత ఎక్కువగా గర్భాశయ కేన్సర్‌కు గురవుతున్నారా?
అమెరికన్ కేన్సర్ సొసైటీ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు తరువాత గర్భం దాల్చిన మహిళలకంటే, 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో పిల్లల్ని కన్న మహిళల్లో భవిష్యత్తులో గర్భాశయ కేన్సర్ బారినపడే అవకాశాలు ఎక్కువున్నాయి.

చిన్నవయసులో 3 లేదా అంతకంటే ఎక్కువ ప్రసవాలు లేదా అబార్షన్లు అయిన మహిళలకు ఇది సోకే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటివరకు గర్భాశయ కేన్సర్ సోకినా.. ఇంత చిన్నవయసులో మరణించిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఓ సర్వే ప్రకారం.. సర్వైకల్ కేన్సర్ బారిన పడిన శ్వేతజాతి మహిళల్లో 67శాతం కోలుకునే అవకాశం ఉంది. అదే నల్లజాతి మహిళల్లో దీనిరేటు 56% ఉంది. కాగా, 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలలో 46 శాతం దీని నుంచి కోలుకునే అవకాశాలున్నాయి.

అయితే.. 50 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలు ఈ కేన్సర్ సోకినా.. 61శాతం వరకు కోలుకున్నారు. 50 ఏళ్లలోపు మహిళలు 77శాతం దీనినుంచి కోలుకునే అవకాశాలున్నాయి. గర్భాశయ కేన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే దాదాపుగా 92శాతం మంది కోలుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement