Sunday, May 5, 2024

సారంగ‌దరియా సాంగ్ కు సితార డ్యాన్స్.. వైర‌ల్ అవుతోన్న వీడియో

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలు, వీడియోలతో పాపులరైన సీతు పాప.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే మిలియన్‌కు పైగా ఫాలోవర్లను సంపాదించింది. మల్టీటాలెంటెడ్ గర్ల్. చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కొద్ది రోజులుగా సీతార కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ వద్ద డాన్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్‏కు డాన్స్ చేసి అదరగొట్టేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ‘లవ్‌స్టోరీ’ సినిమాలో సాయి పల్లవి పాట ‘సారంగదరియా’ సాంగ్‌కు అద్భుతంగా డాన్స్ చేసింది సితార. ఈ వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ పాటలో తన పెర్ఫార్మెన్స్‌కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement