Friday, May 3, 2024

గర్భిణీని మూడు కిలోమీటర్లు నడిపించిన ఎస్ఐ…వెంటనే సస్పెండ్

కొంతమంది పోలీసులు జాలి, దయ లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు. మరి కొంతమంది సేవా దృక్పథంతో సహాయ పడుతూ ఉంటారు. అయితే తాజాగా ఓ మహిళ ఎస్సై ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని నిండు గర్భిణిని 3 కి.మీ నడిపించింది. అయితే గర్భవతిగా ఉన్న తన భార్య పట్ల కనికరం లేకుండాప్రవర్తించారని ఆమె భర్త ఫిర్యాదు చేయడంతో.. ఎస్ ఐ ను స్మిత ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.బికరాం అనే వ్యక్తి హెల్మెట్ లేకుండా తన భార్య రీనాను తీసుకొని బైక్ పై వెళ్తున్నాడు. తనిఖీలు చేపట్టిన స్మిత.. ఫైన్ విధించడమే కాకుండా వారిద్దరినీ తన ఆఫీస్ వరకు నడిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement