Sunday, April 28, 2024

ఈనెల 21 నుంచి కూతపెట్టనున్న శతాబ్ది, దురంతో రైళ్లు

క‌రోనా ఎఫెక్ట్ తో దేశంలో రైల్వే స‌ర్వీసులు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో రైల్వే త‌న స‌ర్వీసుల‌ను తిరిగి ప‌ట్టాలెక్కిస్తోంది. కొన్ని ప్ర‌త్యేక ఎక్స్ ప్రెస్ రైళ్ల‌ను రైల్వే న‌డుపుతుండ‌గా… ఈనెల 21 నుండి ప‌లు మార్గాల్లో న‌డిచే ట్రైన్ల‌ను రైల్వేశాఖ ప్ర‌క‌టించింది.

ఈ జాబితాలో శతాబ్ది, దురంతో పాటు 29 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి. వీటికి అద‌నంగా ఈ నెల 25 నుంచి సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను గోరఖ్‌పూర్‌ నుంచి బాంద్రా టెర్మినస్‌ వరకు నడుపుతామని కేంద్ర రైల్వేమంత్రి తెలిపారు. ఇందులో న్యూఢిల్లీ-కల్కా శతాబ్ది, న్యూఢిల్లీ-డెహ్రాడూన్‌ శతాబ్ది, న్యూ ఢిల్లీ-అమృత్‌సర్‌ జంక్షన్‌ శతాబ్ది, ఢిల్లీ సారాయ్‌ రోహిల్లా-జమ్ముతావి దురంతో ఎక్స్‌ప్రెస్‌, శ్రీమాతా వైష్ణోదేవి కత్రా-న్యూఢిల్లీ శ్రీ శక్తి ఎక్స్‌ప్రెస్‌, లక్నో-ప్రయాగ్‌రాజ్‌ సంగం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ నెల 21 నుంచి న‌డ‌వ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement