Thursday, April 25, 2024

రామ్ చ‌ర‌ణ్ తీసుకెళ్తే సినిమాకి వ‌స్తా.. షారుక్ ఖాన్

న‌న్ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తీసుకెళ్తే ప‌ఠాన్ చిత్రానికి వ‌స్తాన‌న్నారు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్.కాగా షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రం జనవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ పాన్ ఇండియా మూవీ.. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కి సిద్ధ‌మైంది. దీపికా పదుకొనె, జాన్ అబ్ర‌హం కూడా ఈ చిత్రంలో న‌టించారు. ప్ర‌స్తుతం ప‌ఠాన్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలతో చిత్ర యూనిట్‌ బిజీగా ఉంది. ఈ క్ర‌మంలో షారూఖ్ ఖాన్ త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మంలో పాల్గొన్నారు. ఇందులో త‌న ఫ్యాన్స్‌, నెటిజ‌న్స్‌ను ఆయ‌న ప్ర‌శ్న‌లు వేయ‌మ‌న్నారు. అందులో ఆయ‌న కొన్ని ఫ‌న్నీ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. అలాంటి ఓ ప్ర‌శ్న కు షారూఖ్ ఖాన్ ఇచ్చిన స‌మాధానం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఓ అభిమాని షారూఖ్‌తో ‘‘హాయ్ సర్, మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల్లో మూవీ థియేటర్స్‌కి వ‌స్తారా అని ప్ర‌శ్నించాడు. దానికి షారూఖ్ ఖాన్ స‌మాధానం చెబుతూ ‘తప్పకుండా.. అయితే నన్ను రామ్ చరణ్ తీసుకెళితేనే వస్తాను అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement