Friday, April 19, 2024

ముందు నివేదిక కేంద్రానికి పంపండి.. పంట నష్టంపై సీఎం కేసీఆర్‌కు బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అకాల వర్షాల కారణంగా తెలంగాణలో చోటుచేసుకున్న పంటనష్టంపై త్వరగా కేంద్ర ప్రభుత్వానికి వాస్తవ నివేదికలు పంపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి సూచించారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, తప్పుడు నివేదికలతో కేంద్రాన్ని తప్పుదోవ పట్టించవద్దని హితవు హితవు పలికారు. అలాగే పంటనష్టం జరిగిన ప్రాంతాల్లో తూతూమంత్రంగా పర్యటనలు జరిపితే ఉపయోగం లేదని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా రైతులు ఏదో ఒక రూపంలో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ ఒక్క రోజు కూడా పరామర్శించలేదని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని గ్రహించిన సీఎం పిట్టల దొరలా టోపి పెట్టుకుని పరామర్శలకు బయలుదేరారని ఎద్దేవా చేశారు.

.ప్రకృతి వైపరీత్యాలు జరిగనప్పుడు కలెక్టర్ల, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపితే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదికలు పంపిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదికపై కేంద్ర బృందం పర్యటించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందిస్తుందని అన్నారు. పంట నష్టంపై కేంద్రాన్ని విమర్శించేందుకు కేసీఆర్ పర్యటనకు బయలుదేరారని ఆరోపించారు. తెలంగాణలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతులను ఏ విధంగా వంచిస్తున్నారనేది దేశంలో ఇతర రాష్ట్రాల్లో గమనిస్తున్నారని అన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ఏ ఇతర సబ్సిడీలు ఇవ్వకుండా.. వాటి కంటే తక్కువ ఖర్చుతో పూర్తయ్యే రైతు బంధు ఒక్కటి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement