Thursday, April 25, 2024

అన్నదాతకు మళ్లీ కష్టం !


• ధాన్యం విక్రయించేందుకు కిలోమీటర్ల కొద్దీ బారులు
• దిగుమతిలో జాప్యం చేస్తున్న మిల్లర్లు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ధాన్యం విక్రయంలో అన్నదాతలకు మళ్లీ గతేడాది కష్టాలే వచ్చాయి . రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు పూర్తయి .. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుండగా , సన్నధాన్యం మిల్లులకు వెళ్తుంది . సన్న ధాన్యం మొత్తం మిల్లులకే వెళ్తుండటంతో దిగుమతిలో జాప్యం జరగడంతో పాటు కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరుతున్నాయి . ప్రధానంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడెం లో మిల్లులు అధికంగా ఉండడంతో ఖమ్మం , సూర్యాపేట , వరంగల్ తో పాటు ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా ధాన్యం ఇక్కడి మిల్లులకే అధికంగా వస్తుండ డంతో మిల్లుల్లో స్థలం లేకపోవడంతో దిగుమతిలో జాప్యం ఏర్పడుతోంది . వాస్తవానికి గత రెండు , మూడేండ్ల నుంచి నవంబర్ , డిసెంబర్ మాసాల్లో సన్నధాన్యం మిల్లులకు పోటెత్తే విషయం అధికారులకు , మిల్లర్లకు తెలిసినప్పటికీ సరైన విధంగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం.. ధాన్యం విక్రయించుకునేందుకు రైతులు మళ్లీ రోడ్డెక్కాల్సి వచ్చింది .

మిర్యాలగూడెం- సాగర్ రోడ్డులో ధాన్యం విక్రయించుకునేందుకు టోకెన్లను ఎక్కువగా జారీచేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు . వరి కోతలు పూర్తయి . విక్రయించుకునేందుకు మిల్లులకు వెళ్తున్న రైతులకు ధాన్యం దిగుమతిలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి . ఇదే సమయంలో దిగుమతికి టోకెన్లు కీలకంగా మారాయి . టోకెన్లు కీలకం కావడంతో రైతులు రోజుల తరబడి క్యూలో నిలబడి మరీ టోకెన్లను తీసుకోవాల్సి వస్తోంది . మిర్యాల గూడ మండల కార్యాలయంలో టోకెన్లను ఇస్తుండగా , దీపావళి కి ముందురోజు రైతుల ఆందోళన చేపట్టగా కొంతమంది ఖాళీ స్లిప్లు ఇచ్చి .. శుక్రవారం వారికి తేదీల వారీగా కొత్త టోకెన్లు జారీచే యడంతో పరిస్థితి మరింత ఆందోళనగా మారింది . దీంతో శుక్ర వారం సాయంత్రం మిర్యాలగూడెం – సాగర్రోడ్లో రైతులు రోడ్డు పైకి వచ్చి ఆందోళన నిర్వహించారు . అనంతరం అధికారులు 9 వ తేదీ వరకు టోకెన్లు జారీచేశారు . ఇదిలా ఉండగా టోకెన్ల జారీలో పారదర్శకత లేకపోవడంతో అధికార పార్టీకి చెందిన కొంతమంది క్రియాశీలకంగా వ్యవహరిస్తూ టోకెన్లను వారికి సంబంధించిన వారికి ఇచ్చుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement