Saturday, May 18, 2024

సెబాస్టియన్ PC524 ట్రైలర్ రేపు రిలీజ్.

'ఎస్ఆర్ కళ్యాణమండపం' ఫేమ్ కిరణ్ అబ్బవరం న‌టిస్తున్న మూవీ 'సెబాస్టియన్ పి.సి. 524స‌. మార్చి 4న విడుద‌ల‌కు సిద్దంగా ఈ సినిమా ద్విభాషా చిత్రం కావడంతో 'సెబాస్టియన్ పి.సి. 524' తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌ను ప్రారంభించడానికి మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన ట్రైల‌ర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం నైట్ బ్లైడ్ నెస్ ఉన్న‌ పోలీసు పాత్రలో నటించనున్నాడు. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ ద్విభాషా యాక్షన్ డ్రామాలో నమ్రత దారేకర్, కోమలి ప్రసాద్ కథానాయికలుగా నటించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆసక్తికరమైన థ్రిల్లర్‌గా రూపొందించబడింది, సెన్సేషనల్ కంపోజర్ జిబ్రాన్ సంగీతం అందించారు. కాగా, ట్రైల‌ర్ రిటీజ్ కి సంబందించి ఓ పోస్ట‌ర్ను రిలీజ్ చేసారు మూవీ టీమ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement