Friday, April 26, 2024

అద‌ర‌గొట్టిన అన్ స్టాప‌బుల్2 ట్రైల‌ర్- త‌గ్గేదే లే అంటోన్న బాల‌య్య‌

అన్ స్టాప‌బుల్ 2 సీజన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ఆహా సంస్థ విడుదల చేసింది. అంధకార భయారణ్యంలో నిక్షిప్తమైన నిగూడ నిధి అన్‌ మ్యాచెబుల్‌, అక్కడ ఎదురయ్యే సవాళ్ళు అన్‌ ప్రెడిక్టెబుల్‌, అయినా ఆగని మనం పోరాటం అన్‌స్టాపబుల్, గెలుపే ఊపిరిగా.. పట్టుదలే ప్రాణంగా.. ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌స్టాపబుల్‌. ప్రశ్నల్లో మరింత ఫైర్‌.. ఆటల్లో మరింత డేర్‌.. సరదాల్లో మరింత సెటైర్‌..మీకోసం మరింత రంజుగా అన్‌స్టాపబుల్‌-2’ అంటూ హీరో బాల‌కృష్ణ చెప్పే డైలాగ్స్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. చివరిలో దెబ్బకి థింకింగ్‌ మారిపోవాలా అంటూ వచ్చే డైలాగ్‌ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ ట్రైలర్‌ ట్రెజర్‌ హంట్‌ నేపథ్యంలో కత్తి కోసం బాలయ్య ఎలాంటి సవాళ్లు ఎదుర్కున్నాడు అని చూపించారు. రెండో సీజన్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌ను అక్టోబర్ 14న స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఈ ట్రైలర్ కి అ! మూవీ ఫేం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించాడు.అంతేకాకుండా ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. ఈ సారి అల్లు అరవింద్‌ ఇంకాస్త గ్రాండియ‌ర్‌గా రెండో సీజన్‌ను రూపొందినట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement