Friday, May 17, 2024

ఈ నెల25 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం..

క‌ర్నాట‌కలో ఈనెల 25 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ ఆదేశించారు. అంద‌రి ఆరోగ్యం, భ‌ద్ర‌త దృష్ట్యా ప్ర‌తిఒక్క‌రూ కొవిడ్‌-19 ప్రొటోకాల్‌ను విధిగా పాటించాల‌ని కోరారు. మంత్రులు, విద్యావేత్త‌లు, ఉన్న‌తాధికారుల‌తో సీఎం ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌మావేశంలో స్కూల్స్ రీఓపెన్‌పై నిర్ణ‌యం తీసుకున్నారు. 9, 10, 11వ త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని పేర్కొన్నారు. స్కూల్స్ రీఓపెన్‌కు సంబంధించి నిర్ధిష్ట మార్గ‌ద‌ర్శ‌కాల‌ను మంగ‌ళ‌వారం జారీ చేస్తామ‌ని మంత్రి వెల్ల‌డించారు. త‌ర‌గ‌తుల‌ను బ్యాచ్‌ల వారీగా రోజు మార్చి రోజు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. గ‌తంలో ఆగ‌స్ట్ 23 నుంచి స్కూల్స్ పున‌:ప్రారంభ‌మ‌వుతాయ‌ని క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌గా తాజాగా 25 నుంచి స్కూల్స్ రీఓపెన్ ఉంటుంద‌ని వెల్ల‌డించారు. స్కూల్స్ రీఓపెన్ సంద‌ర్భంగా ప్ర‌తిఒక్క‌రూ విధిగా మాస్క్ ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారిపై చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని విద్యా శాఖ మంత్రి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: వర్షం దెబ్బకు తొలి టెస్ట్ డ్రా..

Advertisement

తాజా వార్తలు

Advertisement