Friday, May 17, 2024

Delhi : న‌వంబ‌ర్ 10వ‌ర‌కు పాఠ‌శాల‌లు బంద్

దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్న దృష్ట్యా ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి తెలిపారు. ఈ సమయంలో పాఠశాలలు 6 నుండి 12 తరగతులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చని సూచించారు.

ఢిల్లీ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ ఢిల్లీలో అధిక స్థాయికి వాయు కాలుష్యం చేరుకుందన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ కాలుష్యం ముఖ్యంగా ఇది పిల్లలకు చాలా హానికరం కావొచ్చు. వాయు కాలుష్యం దృష్ట్యా, ఢిల్లీ ప్రభుత్వం 2023 నవంబర్ 10 నాటికి ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement