Friday, May 17, 2024

టాలీవుడ్ టీజర్స్: 1వ స్థానంలో మహేష్‌.. 8వ స్థానంలో పవన్‌

మహేష్‌బాబు కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ విడుదల కాకముందే నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన టీజర్ టాలీవుడ్‌లోనే అత్యధిక వ్యూస్‌ సాధించి రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ మేరకు 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సంపాదించిన తొలి టాలీవుడ్ టీజర్‌గా సర్కారు వారి పాట రికార్డులకెక్కింది. ఈ మూవీ టీజర్‌ 24 గంటల్లో 25.7 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతే కాకుండా 7 లక్షలకు పైగా ఈ వీడియోను లైక్ చేశారు.

మరోవైపు ఈ జాబితాలో రెండో స్థానంలో అల్లు అర్జున్ ‘పుష్ప పార్ట్-1’ నిలిచింది. పుష్పరాజ్‌ను పరిచయం చేస్తూ గతంలో విడుదలైన టీజర్‌కు 24 గంటల్లో 22.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే మూడో స్థానంలోనూ సూపర్ స్టార్ మహేష్‌బాబు మూవీనే ఉండటం విశేషం. సరిలేరు నీకెవ్వరూ మూవీ 24 గంటల్లో 14.64 మిలియన్ వ్యూస్‌తో మూడో స్థానంలో నిలిచింది. రామ్‌రాజు ఫర్ భీమ్ టీజర్ 14.14 మిలియన్ వ్యూస్‌తో నాలుగో స్థానంలో ఉంది. ప్రభాస్ ‘సాహో’ మూవీ టీజర్ 24 గంటల్లో 12.94 మిలియన్ వ్యూస్ సాధించింది. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ మాత్రం 8.57 మిలియన్ వ్యూస్‌తో 8వ స్థానంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement