Wednesday, May 1, 2024

వర్షాలు వచ్చినా ముంపు ప్రాంతాలు లేకుండా ప్రత్యేక చ‌ర్య‌లు : ఎమ్మెల్యే అరూరి

వరంగల్ మహా నగరంలో వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా ఎలాంటి ముంపు ప్రాంతాలు లేకుండా ఉండేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాల్ పూర్ చెరువు వరద కాలువ నిర్మాణ పనులను నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఎమ్మెల్యే అరూరి రమేష్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. గోపాల్ పూర్ చెరువు వరద కాలువను 58కోట్లతో నిర్మిస్తున్నామని, వచ్చే వర్షాకాలంలోగ పనులు పూర్తి చేసి కాలనీ వాసులకు ముంపు లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తాగు నీటి కోసం OT నిర్మాణానికి స్థల పరిశీలన చేశామని అలాగే మరో 10.50 కోట్ల అదనపు నిధులతో UT నిర్మాణాన్ని సైతం చేపట్టానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిరంగి సునీల్, డివిజన్ అధ్యక్షుడు మనింద్రనాథ్, ఇరిగేషన్ శాఖ ఎస్సీ, బల్దియా అధికారులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement