Sunday, June 2, 2024

Sangareddy | జిన్నారం పారిశ్రామిక వాడ‌లో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా జిన్నారం పరిధిలోని గడ్డి పోతారంలోని పారిశ్రామికవాడలో ఉన్న‌ హెటిరో పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ETP విభాగంలో (సోమవారం) సాల్వెంట్ రికవరీ చేస్తున్నప్పుడు మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు.

మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

మంటలు చెలరేగిన పరిశ్రమలో కార్మికులు ఎవరైనా చిక్కుకున్నారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హెటిరో ల్యాబ్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement