Saturday, July 27, 2024

జలదీక్షకు ముస్తాబైన సంగమేశ్వరం ఘాట్

సీమ ప్రజల గుండె చప్పుడు.. ప్రజల హృదయ స్పందన..సిద్దేశ్వరం అలుగు. రాయలసీమకు చట్టబద్ద నీటి హక్కులకై, సిద్దేశ్వర అలుగు నిర్మాణం కోసం మంగళవారం సిద్దేశ్వరం దగ్గర జలదీక్ష జరుగనున్న నేపథ్యంలో… సంగమేశ్వరం దగ్గర రాయలసీమ గొంతుక ప్రపంచానికి తెలుపేందుకు జలదీక్ష ప్రాంగణం ముస్తాబైంది. అలుగు నిర్మాణం వలన కరువు సీమ దాహార్తి తీరడమే గాక సాగునీరు లభిస్తుంది. అలుగు నిర్మాణం వలన రాయలసీమ సామాజికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నది సీమ వాసుల అభిప్రాయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement