Friday, April 26, 2024

ప్రాంతీయం నుండి పాన్ ఇండియాకు ఎదిగిన శాండిల్ వుడ్..

పాన్‌ ఇండియా… ప్రాంతీయ చిత్రాల స్థాయిని పెంచింది. ప్రాంతానికే పరిమితమైన హీరోల ను ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తున్నారు. కలెక్షన్ల పంటపండిస్తున్నారు. కథ ఏదైనా సరే ఆసక్తిగా చెప్పగ లిగితే అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఆదరిస్తారని బాహుబ లి, కేజీఎఫ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప వంటి చితాలు నిరూ పించాయి. దీనివల్ల ప్రాంతీయ సినిమాల మార్కెట్‌ అనూహ్యంగా పెరిగింది.
ఒకప్పుడు కన్నడ సినిమాల స్థాయి చాలా తక్కువ. పరిమిత వ్యయంతో తీస్తారనే పేరుంది. తెలుగులో తమిళంలో అలాగే ఇతర భాషల్లో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలను తక్కు వ బడ్జెట్‌తో తక్కువ క్వాలిటీ-తో కన్నడంలో రీమిక్స్‌ చేసి విడుదల చేసేవాళ్లు కానీ తర్వాత పరిస్థితు లు మారాయి. కన్నడ బ్రాండ్‌ ఉం డాలనే ప్రయత్నాలు సైతం జరిగాయి.

ఇటీవల కాలంలో కన్నడ సినీ పరిశ్రమలో తెరకెక్కుతున్న సిని మాలు కేవలం కన్నడ ప్రేక్షకులను మాత్రమే కాదు. పాన్‌ ఇండియా స్థాయిలో ఇతర భాషల ప్రేక్షకుల ను కూడా అలరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మిగతా భాషలతో పోలిస్తే చాలా తక్కువ బడ్జెట్‌ తో లిమి-టె-డ్‌ బడ్జెట్‌ తో మంచి ఔట్‌ పుట్‌ తీసుకొస్తున్న విషయం కూడా అందరూ గమనించే ఉంటారు.
ప్రాంతీయ మార్కెట్‌ దాటని సినిమాలు ఇప్పు డు విదేశాల్లో భారీ కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఫస్ట్‌ -టైమ్‌ ఇండియా వైడ్‌ గా సత్తా చాటటమే కాకుండా ఓవర్సీస్‌ లో కూడా కొత్త మార్కెట్‌ ఓపెన్‌ చేసి సరికొత్త -టె-ండ్‌ సెట్‌ చేశాయి. కన్నడ సినిమాకు ఇప్పటి వరకూ ఓవర్సీస్‌ లో రాని ఓపెనింగ్స్‌, కలెక్షన్స్‌ గత ఏడాది విడుదలైన అయిన సినిమాలతో వచ్చి అక్కడకూడా హ్యూజ్‌ రెస్పాన్స్‌ సొంతం చేసుకుంది. కన్నడ సినిమా పరిశ్రమ దక్షిణాదిలో దేశవ్యాప్తంగా అంతగా మార్కెట్‌ లేని పరిశ్రమ. అయితే ఇదంతా ‘కెజిఎఫ్‌ 2 ‘ ధియేటర్లోకి రాకముందు వరకే. ఒక్క సారి రాకీ రంగంలోకి దిగి మొత్తం కలెక్షన్ల రికార్డులను మార్చేశాడు. 2022 ఏప్రిల్‌ లో రిలీజ్‌ అయిన కెజిఎఫ్‌ తో కన్నడ సినిమా పరిశ్రమ సత్తా పెంచడమే కాకుండా ఓవర్సీస్‌ లో కొత్త మార్కెట్‌ ఓపెన్‌ చేసింది. 200కోట్లకు పైన ఓవర్సీస్‌ లోనే కలెక్షన్లు రాబట్టిందంటే కెజిఎఫ్‌ 2 ఏ రేంజ్‌ లో విజయం సాధించిందనేది స్పష్టమవుతోంది. 100కోట్ల లోపు బడ్జెట్‌ తో తెరకెక్కిన కెజిఎఫ్‌ 2 సినిమా 1200 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టి కన్నడ పరిశ్రమలోనే కాకుండా ఓవర్సీస్‌ లో కూడా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ అయిన కన్నడ సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది

కెజిఎఫ్‌ సక్సెస్‌ గురించి ఇంకా మాట్లాడు కుంటు-ండగానే రిలీజ్‌ అయిన ‘ కాంతారా’ కూడా ఓవర్సీస్‌ దగ్గర ఖాతా ఓపెన్‌ చేసింది. 25 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిన ‘కాంతారా’ ఓవర్సీస్‌ లోనే 45కోట్లు- రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లతో దుమ్ము రేపిన కాంతారా రీజనల్‌ సబ్జెక్ట్‌ అయినా కూడా కోర్‌ ఎమోషన్‌తో ఓవర్సీస్‌ లో కలెక్షన్లు రాబట్టింది. ఇలా గ్లోబల్‌ వైడ్‌ గా ఇండియన్‌ సినిమా క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుంటూ వరల్డ్‌ వైడ్‌ మార్కెట్స్‌ ఓపెన్‌ చేస్తూ అక్కడ హ్యూజ్‌ కలెక్షన్లతో ఓవర్సీస్‌ లో జెండా పాతేస్తోంది ఇండియన్‌ సినిమా.

ఈ మధ్యకాలంలో వచ్చిన కేజిఎఫ్‌ పార్ట్‌ 1 పార్ట్‌ 2 సుదీప్‌ హీరోగా వచ్చిన ‘విక్రాంత్‌ రోనా’, రక్షిత్‌ శెట్టి హీరోగా వచ్చిన ‘777 చార్లీ’, రిషబ్‌ శెట్టి హీరోగా వచ్చిన ‘కాంతార’ సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించగా ఉపేంద్ర హీరో గా వస్తున్న ‘కబ్జ’ సినిమా కూడా ప్రేక్షకులంలో అంచనాలు రేకెత్తించే విధంగా ఉంది.

ఇక తాజాగా అర్జున్‌ మేనల్లుడు చిరంజీ వి సర్జ తమ్ముడు ధృవ సర్జా హీరోగా నటిం చిన ‘మార్టిన్‌’ సినిమాకి సంబంధించిన టీ-జర్‌ విడుదలైంది. ఈ టీ-జర్‌ కూడా ప్రేక్షకులలో అంచనాల పెంచే విధంగా సాగింది. అంటే కన్నడ సినీ పరిశ్రమ నుంచి మరో హార్ట్‌ మూవీ తెలుగు ప్రేక్షకులు ముందుకు రాబోతుందని అర్థమైంది.ఈ సినిమాని కేవలం తెలుగు కన్నడ భాషలోనే కాదు పాన్‌ ఇండియా లెవెల్లో రిలీజ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు-గా తెలుస్తోంది. అంటే మిగతా భాషలతో పోలిస్తే కన్నడ సినీ పరిశ్రమలో బడ్జెట్‌ తక్కువే అయినా క్వాలిటీ- విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తీసుకొస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement