Thursday, June 13, 2024

ఈ నెల 9న.. శాకుంత‌లం ట్రైలర్ రిలీజ్

వచ్చేనెల 17వ తేదీన సినిమా విడుదల శాకుంతలం సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు టీమ్ ప్రకటించింది. ఈ నెల 9వ తేదీన 12:06 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు గుణశేఖర్ ఎంత మనోహరంగా మలిచార‌నేది ఈ పోస్టర్ చూస్తేనే అర్థమైపోతోంది.ఈ సినిమాకి ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టైటిల్ రోల్ ను స్టార్ హీరోయిన్ సమంత పోషించగా, ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటోంది. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటుగా తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో దేవ్ మోహన్ .. మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement