Sunday, May 5, 2024

రికార్డు ధరకు ‘సాలార్’ నాన్-థియేట్రికల్ రైట్స్..

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ‘సాలార్’ సినిమా వాయిదా పడింది. సినిమా వాయిదా పడడంతో అభిమానుల్లో నిరాశ నెల‌కొంది. అయితే, ఈ పాన్ ఇండియన్ మూవీ ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ తో రికార్డులు సృష్టిస్తోంది. సాలార్ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

సాలార్ మూవీ శాటిలైట్ (Star TV) + డిజిటల్ (నెట్‌ఫ్లిక్స్ – తెలుగు, తమిళం, కన్నడ) + ఆడియో హక్కులు దాదాపు 350 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఈ యాక్షన్ డ్రామాని 2024 సంక్రాంతి లేదా హోలీ పండుగలో విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఇప్పటికే ఓవర్సీస్‌లో మూవీ టికెట్లు లక్షల్లో అమ్ముడుపోయాయి.. మరి వారికి డబ్బులు తిరిగి ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement