Saturday, May 4, 2024

ర‌ష్యా లూనా 25 ప్ర‌యోగం విఫ‌లం…చివ‌రిక్ష‌ణంలో చంద్రుడిపై కుప్ప‌కూలిన ల్యాండ‌ర్

మాస్కో – చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా చేపట్టిన ‘లూనా–25’ ప్రయోగం చివరి క్షణంలో విఫలమైంది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ ఆదివారం అధికారికంగా వెల్లడించింది. లూనా –25లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని తొలుత రష్యా వెల్లడించింది. తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే అంతరిక్ష నౌక కూలిపోయినట్లు గుర్తించింది.

చంద్రుడిపై దిగే సమయంలో ల్యాండర్ క్రాష్ అయినట్లు రోస్‌కాస్మోస్ వెల్లడించింది. దాదాపు 47 ఏళ్ల తర్వాత జాబిల్లిపై పరిశోధనల కోసం లూనా–25ను రష్యా చేపట్టింది. చంద్రయాన్–3ని ఇస్రో ప్రయోగించిన కొన్ని రోజుల తర్వాత లూనా–25ను రష్యా ప్రయోగించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్–3 కంటే ముందే దిగేలా ఈ ప్రాజెక్టు చేపట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement