Sunday, April 14, 2024

Karnataka: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

టెంపో వాహ‌నం బోల్తాప‌డ‌డంతో ముగ్గురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న‌ కర్నాటకలో జరిగింది. టెంపో వాహనం బోల్తా పడడంతో ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే చనిపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.

మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన మస్తాన్, పెద్ద వెంకన్న, ఈరన్నగా గుర్తించారు. కర్నూలు నుండి కర్నాటకకు మిర్చి అమ్మకానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement