Tuesday, October 15, 2024

PM Modi: అవినీతికి మారు పేరు ఆర్‌జేడీ..

గ‌య ఎన్నిక‌ల స‌భ‌లో మోదీ విసుర్లు
వారికి స్వప్ర‌యోజ‌నాలే ముఖ్యం
చివ‌రికి ప‌శుగ్రాసాన్ని కూడా మేసేసిన ఘ‌నులు
కాంగ్రెస్ పాల‌న‌లో దేశంలో అభివృద్ధి శూన్యం
అంబేద్క‌ర్ రాజ్యంగంతోనే బీసీనైనా ప్ర‌ధాని అయ్యా

గ‌య – బీహార్ – ఈ దురహంకార కూటమి సభ్యులు సనాతన్‌ను డెంగ్యూ మలేరియా అని పిలుస్తారని, రామ మందిరాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు ప్ర‌ధాని మోదీ. వారికి ఎలాంటి దృక్పథం, విశ్వాసం లేవని ఆయన అన్నారు. మూడోసారి బీహార్‌ పర్యటనలో ఉన్న ఆయ‌న‌ ఈరోజు బీహార్‌లోని గయలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారం స‌భ‌లో మాట్లాడుతూ… ఆర్‌జేడీ బీహార్‌ను చాలా సంవత్సరాలు పాలించిందన్నారు. కానీ తమ ప్రభుత్వాలు చేస్తున్న పనులపై చర్చించే ధైర్యం వారికి లేద‌న్నారు. బీహార్‌లో అవినీతికి మరో పేరు ఆర్జేడీ అంటూ విరుచుకుప‌డ్డారు. బీహార్ విధ్వంసానికి ఆర్జేడీ పెద్ద ముద్దాయని, చివ‌ర‌కు ప‌శువుల మేత‌ను సైతం దొంగిలించార‌ని విమ‌ర్శించారు.

భారతదేశం సుభిక్షంగా మారాలని రాజ్యాంగ నిర్మాతలు కలలు కనేవారని, అయితే దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఆ అవకాశాన్ని కోల్పోయి దేశ సమయాన్ని వృధా చేసిందని కాంగ్రెస్‌పై ప్రధాని దాడి చేశారు. బీజేపీ విజయాన్ని లెక్కించే సమయంలో 4కోట్ల మందికి ఇళ్లు ఇచ్చామని చెప్పిన ప్ర‌ధాని రాష్ట్రీయ జనతాదళ్ మాత్రం తన స్వప్రయోజనాలను మాత్రమే నెరవేర్చిందన్నారు. రేపు శ్రీరామ నవమి పవిత్ర పండుగ అని అంటూ రేపు అయోధ్యలో సూర్యకిరణాలు రాంలాలా శిరస్సుకు ప్రత్యేక అభిషేకం చేయనున్నాయన్నారు.

వారి వ‌ల్లే ఈ ప్ర‌ధాని ప‌ద‌వి…
పేదల ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ ఆశీస్సులతో ఇక్కడికి చేరుకున్నానని మోదీ అన్నారు. డాక్టర్ రాజేంద్రబాబు, బాబా సాహెబ్ అంబేద్క‌ర్ లు రాజ్యాంగం ఇవ్వకపోతే వెనుకబడిన కుటుంబంలోని కొడుకు ప్రధానమంత్రి అయ్యేవాడు కాద‌న్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడుతూ.. మన దేశం వైవిధ్యంతో నిండి ఉందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement