Thursday, April 18, 2024

శ్రీశైలం..సోమ‌శిల జ‌లాశ‌యాల‌కి పెరుగుతోన్న వ‌ర‌ద ప్ర‌వాహం

జురాల‌,సుంకేశుల‌,హంద్రీ నుంచి 91,280క్యూసెక్కుల వ‌ర‌ద‌నీరు వ‌స్తుండ‌టంతో శ్రీశైలం జ‌లాశ‌యానికి వ‌ర‌ద ప్ర‌వాహం పెరుగుతోంది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.40 అడుగుల వరకు నీరు వచ్చింది . నీటి నిల్వ 201.12 టీఎంసీల వరకు ఉందని, శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగు తుందని అధికారులు వెల్లడించారు. విద్యుదుత్పత్తి ద్వారా 66,089 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నట్లు వివరించారు. సోమశిల జలాశయానికి ఎగువన కురుస్తున్న వర్షాలకు 34వేల క్యూసెక్కు ల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది . పెన్నా నదిలోకి 43 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సోమశిల జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 77. 9 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 71 టీఎంసీలుగా ఉందని అధికారులు వెల్లడించారు. సోమశిల, సంగం వద్ద పెన్నా నది వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. పెన్నా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement