Saturday, May 4, 2024

తెలంగాణలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వారిలో 95శాతం కోవిడ్ బారిన పడిన షుగర్ పేషెంట్లే ఉన్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. హైదరాబాద్ తోపాటు జిల్లాల్లోనూ బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. బ్లాక్ఫంగస్ బారిన పడిన వారికి కోఠిలోని ఈఎటో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ కలవరపెడుతోంది, హైదరాబాద్ తోపాటు మెదక్,
భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి .

ఈ జిల్లాల్లో పలువురు బ్లాక్ ఫంగస్ బారిన పడి చనిపోతున్నారు. కరోనా నుంచి కోలుకున్నాకే వీరు చనిపోతుండడంతో బ్లాక్ ఫంగస్ వ్యాధే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement