Sunday, May 5, 2024

ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు.. ఈ ఫీట్ సాధించిన జాబితాలో రింకూ సింగ్..

ఐపీఎల్ 2023 16వ సీజన్లో 8వ తేదీన గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ చివరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది హీరో ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దాంతో, ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఒక ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా రింకూ సింగ్ నిలిచాడు.

అయితే ఈ రికార్డ్ ని స్టార్ట్ చేసింది ఐపీఎల్‌లో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్. ఐపీఎల్ 2012లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నప్పుడు పుణే వారియర్స్‌బౌలర్ రాహుల్ శర్మ బౌలింగ్‌లో గేల్ మొదటిసారిగా ఒక ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదాడు.

IPLలో ఒక ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితా..

  1. క్రిస్ గేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) vs రాహుల్ శర్మ (పుణె వారియర్స్), బెంగళూరు, 2012.
  2. రాహుల్ తెవాటియా (రాజస్తాన్ రాయల్స్) Vs షెల్డన్ కాట్రెల్ (పంజాబ్ కింగ్స్), షార్జా, 2020.
  3. రవీంద్ర జడేజా (చెన్నై సూపర్ కింగ్స్) vs హర్షల్ పటేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ముంబై WS, 2021.
  4. మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్ (LSG) Vs శివమ్ మావి (కోల్‌కతా నైట్‌రైడర్స్), పుణే, 2022.
  5. రింకూ సింగ్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) vs యష్ దయాళ్ (గుజరాత్ టైటాన్స్), అహ్మదాబాద్, 2023.
Advertisement

తాజా వార్తలు

Advertisement