Wednesday, February 8, 2023

ఆటోవాలాల‌కి.. రివ‌ర్స్ డ్రైవింగ్ పోటీలు

ఆటోవాలాల‌కి రివ‌ర్స్ ఆటోరిక్షా డ్రైవింగ్ పోటీలు పెట్టారు. సంఘమేశ్వర యాత్రలో భాగంగా మహారాష్ట్ర సంగ్లీ జిల్లా హరిపూర్‌ గ్రామంలో ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు ఆటోవాలాలు పాల్గొని దుమ్మురేపే డ్రైవింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. కిలోమీటర్ల దూరం వరకు ఆగకుండా హైస్పీడ్‌తో ఆటోను రివర్స్‌ చేస్తూ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఆటోవాలాల ప్రతిభను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement