Monday, April 29, 2024

మద్యం అమ్మకాలతో 6 వేల కోట్ల ఆదాయం టార్గెట్​.. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న ఆబ్కారీ శాఖ

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి : హెదరాబాద్‌ జిల్లాలో దాదాపు 150 వరకు వైన్స్‌లు, 250 వరకు బార్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఏడాది కంటే మద్యం విక్రయాలను రెండింతలు పెంచే దిశగా అధికారులు దృష్టి పె ట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2,828.29 కోట్ల విక్రయాలు జరగగా, 2021-22లో రూ.3,226.47 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గడిచిన రెండేళ్ల విక్రయాలను చూస్తే ప్రతి ఏటా నగరంలో 20శాతం వరకు పెరుగుదల నమోదవుతోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను 20శాతం పెంచింది. ఏటా సగటు పెరుగుదల, పెంచిన ధరలను బేరీజు వేస్తే 40శాతం సాధారణ పెరుగుదల ఈ ఏడాది నమోదు కానుంది. పెరిగిన ధరలను, సగటు పెరుగుదలను కలుపుకొని మరింత దృష్టి కేంద్రీక రించడం ద్వారా 60నుంచి 80శాతం అమ్మకాలను పెంచడం ద్వారా హైదరాబాద్‌ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6 వేల కోట్ల విక్రయాలు సాగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. ఇందుకోసం ఆబ్కారీ శాఖ అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. జిల్లాలో ఉన్న స్టే ష న్ల వారీగా సమీక్షలు నిర్వహించి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముమ్మర చర్యలు మొదలు పెట్టారు.

స్టేషన్ల వారీగా సమీక్షలు…

హైదరాబాద్‌ జిల్లాను ఆబ్కారీ శాఖ పరిధిలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పేరిట రెండు సూపరింటెండెట్‌ జోన్లుగా విభజించారు. హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో చార్మినార్‌, గోల్కండ, దూల్‌పేట, నాంపల్లి, జూబ్లిహిల్స్‌, అమీర్‌పేట అబ్కారీ పోలీస్‌ స్టే షన్లు ఉండగా, సికింద్రాబాద్‌ సూపరింటెండెంట్‌ పరిధి లో కాచిగూడ, సికింద్రాబాద్‌, నారాయణగూడ, ముషిరాబాద్‌ మొత్తం 11 స్టే షన్లు ఉన్నాయి. వీటి పరిధిలో విక్రయాలపై స్టే షన్ల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ టార్గెట్‌ రాని వారికి తగిన సూచనలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు అందిస్తున్నట్లు సమాచారం. నిర్దేశించిన లక్ష్యం చేరుకునే క్రమంలో ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోవద్దని ఆబ్కారీ శాఖకు సర్కార్‌ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దాంతో అప్రమత్తమైన ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు తగిన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. సర్కార్‌ నిర్దేశించిన లక్ష్యం పూర్తిస్థాయిలో చేరుకోకపోయినా గడిచిన ఏడాది కంటే గరిష్ట పెరుగుదల నమోదు చేసే పనిలో ఆబ్కారీ శాఖ అధికారులు బిజీబిజీగా ఉన్నారని సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement