Thursday, May 2, 2024

డీఎంఈ పరిధిలో కాంట్రాక్టు పద్దతిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకం.. ఈ నెల 12న ఇంటర్వ్యూ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ వైద్య విద్యా డైరెక్టర్‌ పరిధిలో కొత్త పోస్టులు మంజూరయ్యాయి. కాంట్రాక్టు పద్దతిలో ఏడాదికాలానికిగాను ప్రొఫెసర్‌, అసోసి యేట్‌ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ కానున్నాయి. వైద్య విద్యలోని మొత్తం 16 విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు డీఎంఈ తెలిపారు. పోస్టుల భర్తీకి ఈ నెల 12న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

అదే రోజున అర్హుల జాబితాను విడుదల చేయనున్నారు. ఎంపికైన తర్వాత 23తేదీ నాటికి విధుల్లొ చేరాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె స్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement