Friday, April 26, 2024

‘RRR’లో ఎన్టీఆర్ ముస్లిం టోపీ ఎందుకు ధరించాడో తెలుసా?

RRR సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముస్లిం టోపీ పెట్టుకోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ అంశంపై భీమ్ వారసులతో పాటు, చరిత్రకారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. కొమరం భీమ్ ఎప్పుడూ ముస్లిం టోపీని ధరించలేదని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్‌ స్పందించారు. కొమరం భీమ్ టోపీ పెట్టుకోవడానికి గల కారణాన్ని ఆయన వివరించారు.

‘భీమ్‌ను పట్టుకోవాలని నైజాం ప్రభువులు ప్రయత్నించారు. ఆయన్ను వెంటాడారు. నిజాం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొమరం భీం ముస్లిం యువకుడిగా మారాడు. ముస్లిం టోపీ ధరించాడు’ అని విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ ను పోలీసు పాత్రలో చూపించడానికి కూడా ఒక కారణం ఉందని… వెండితెరపై అది ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని తెలిపారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే ‘ఆర్ఆర్ఆర్’ కథను తయారు చేశామని చెప్పారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాత రికార్దులను తిరగరాస్తుందని అటు యంగ్ టైగర్, ఇటు మెగా పవర్ స్టార్ అభిమానులు భావిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: RRR ప్రమోషనల్ సాంగ్‌లో బాహుబలి స్టార్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement