Sunday, November 28, 2021

RRR ప్రమోషనల్ సాంగ్ లో బాహుబలి స్టార్స్ ?

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరంభీం గా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ ను భారీస్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఈ ప్రమోషనల్ సాంగ్ కోసం కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ని రంగంలోకి దించగా… ఇప్పుడు తాజాగా బాహుబలి స్టార్స్ ప్రభాస్, రానా కూడా కనిపిస్తారని టాక్ నడుస్తోంది.

అలాగే వీటితోపాటు మాస్ మహారాజా రవితేజ కూడా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ ముగ్గురు స్టార్స్ కూడా ఆర్ ఆర్ ఆర్ స్టార్స్ తోకలిపి ఈ ప్రమోషనల్ సాంగ్ లో కనిపిస్తారని సమాచారం. కాగా దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఫ్రెండ్షిప్ డే కానుక గా ఈ పాటను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News