Friday, May 17, 2024

రియాల్టీ దిగ్గజం సూపర్‌టెక్‌ దివాలా..

ప్రముఖ రియాల్టి దిగ్గజం సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ దివాలా తీసినట్లుగా నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ప్రకటించింది. బకాయిలు చెల్లించడంలో సదరు సంస్థ విఫలమైందంటూ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పిటిషన్‌ దాఖలు చేయగా, ఎన్సీఎల్టి ఢిల్లి బెంచ్‌ శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో దాదాపు 25వేల హోం బయ్యర్స్‌పై ప్రభావం పడుతుంది. అయితే ఈ తీర్పుపైన తాము నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తామని సూపర్‌టెక్‌ తెలిపింది.

యూపీలోని నోయిడాలో సూపర్‌టెక్‌ నిర్మించిన ట్విన్‌ టవర్స్‌ను కూల్చి వేయాలని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించింది. దీంతో ఈ కంపెనీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో తమకు బకాయిలు చెల్లించడంలో కంపెనీ విఫలమైందని ఎన్సీఎల్టిని యూనియన్‌ బ్యాంకు ఆశ్రయించింది. మార్చి 17న కంపెనీ చేసిన వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ ప్రతిపాదనకు బ్యాంకు నో చెప్పింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement