Sunday, May 19, 2024

రియ‌ల్ శ్వేత‌నాగు-ప‌ట్టుకుని అట‌వీప్రాంతంలో వ‌దిలిన స్నేక్ క్యాచ‌ర్

శ్వేత‌నాగుని ఎప్పుడైనా చూశారా..క‌ర్ణాట‌క‌లో రియ‌ల్ గా శ్వేత‌నాగు క‌నువిందు చేసింది. షిమోగా తాలూక రామేనకొప్ప గ్రామంలోని ఓ తోటలో అరుదైన పాము కనిపించగా.. దాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. మూడున్నర అడుగుల పొడువు ఉన్న నాగుపామును స్నేక్‌ క్యాచర్‌ కిరణ్ దానిని పట్టుకొని.. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే, కర్నాటకలో శ్వేతనాగు కనిపించడం ఇది రెండోసారి. నాలుగేళ్ల కిందట షిమోగాలోని మాండ్లీ సమీపంలోనూ ఒకసారి శ్వేతనాగు దర్శనమిచ్చింది. సాధారణంగా కోబ్రాలు గోధుమ, నలుపు రంగుల్లో ఉంటాయి. చర్మ, రక్త సంబంధిత కారణాలతో తెలుపు రంగులోనూ కనిపిస్తాయని నిపుణులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement