Friday, May 3, 2024

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్ కి షెడ్యూల్డ్‌ బ్యాంకు స్టేటస్‌.. ఆర్బీఐ గ్రీన్‌సిగ్నల్‌

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌కి షెడ్యూల్డ్‌ బ్యాంక్‌ స్టేటస్‌ ఇస్తూ ఆర్బీఐ ప్రకటన చేసింది. షెడ్యూల్డ్‌ బ్యాంక్‌ స్టేటస్‌ దక్కినందున ప్రభుత్వం ఇష్యూ చేసే ఆర్‌ఎఫ్‌పీ(రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోసల్స్‌)కి దరఖాస్తు చేయడంతోపాటు ప్రైమరీ ఆక్షన్లలో పాల్గొనేందుకు వీలుంటుంది. వీటితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో వ్యాపారాలు నిర్వహించవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ నిర్వహణలోని సంక్షేమ పథకాల్లో కూడా భాగస్వామ్యం అయ్యేందుకు వీలుంటుందని ప్రకటనలో ఎయిర్‌టెల్‌ వివరించింది.

దేశంలో వేగంగా వృద్ధి సాధిస్తున్న డిజిటల్‌ బ్యాంకుల్లో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ కూడా ఉంది. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌కు 115 మిలియన్‌ యూజర్ల బేస్‌ ఉంది. ఎయిర్‌ థ్యాంక్స్‌ యాప్‌ ద్వారా డిజిటల్‌ సొల్యూషన్లు అందిస్తోంది. 500,000కిపైగా నైబర్‌హుడ్‌ బ్యాంకింగ్‌ పాయింట్లు ఉన్నాయి. సెప్టెంబర్‌ 2021 త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లాభాలను కూడా గణించింది. షెడ్యూల్డ్‌ బ్యాంకుల జాబితాలో చేర్చినందుకు ఆర్బీఐకి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ సీఈవో అనుబ్రాత్‌ బిశ్వాస్‌ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement