Friday, May 3, 2024

కరోనా కారణంగా రంజీ ట్రోఫీ వాయిదా..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండటంతో మరోసారి క్రీడలపై కొవిడ్‌ ప్రభావం పడింది. ఈ నెల 13నుంచి ప్రారంభంకానున్న దేశవాళీ టోర్నమెంట్‌ రంజీట్రోఫీని వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ఓ ప్రకటనలో తెలిపారు. రంజీ ట్రోఫీకి ముందే పలువురు ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. దీంతో బోర్డు రంజీట్రోఫీ నిర్వహణపై పునరాలోచన చేసింది. తొలుత షెడ్యూల్‌ ప్రకారమే టోర్నీ నిర్వహిస్తామని బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ తెలిపినా కొవిడ్‌ ప్రభావం ఉద్ధృతం అవుతుండటంతో టోర్నీని వాయిదా వేసినట్లు తెలిపారు.

కాగా బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అవిషేక్‌ దాల్మియాతోపాటు అండర్‌-25 క్రికెట్‌ జట్టు కోచ్‌ లక్ష్మీరతన్‌ శుక్లాకు కరోనా సోకడంతో వీరిని ఐసోలేషన్‌కు తరలించారు. బెంగాల్‌జట్టు 6 కొవిడ్‌-19కేసులు, ముంబైజట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శివందూబెతోపాటు ముంబైజట్టులో ఐదుగురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు.కాగా రంజీట్రోఫీతోపాటు కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ, సీనియర్‌ మహిళల టీ20లీగ్‌ వాయిదావేస్తున్నట్లు ప్రకటనలో బీసీసీఐ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement