Friday, May 3, 2024

Ayodya: ప్ర‌ముఖుల‌కు రామ్ ల‌ల్లా ప్రసాద కిట్ లు అంద‌జేత …

అయోధ్యలోని రామ జన్మభూమిలో రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ట కార్య‌క్ర‌మానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానం అందుకున్న ప్ర‌ముఖుల‌లో సుమారు నేడు అయిదు వేల మందికి పైగా హాజ‌ర‌య్యారు. వారంతా రామ్ ల‌ల్లా విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ఠ మ‌హోత్స‌వాన్ని ప్ర‌త్య‌క్ష్యంగా తిల‌కించి మైమ‌రిచిపోయారు.

ఇక వీవీఐపీలు, ఇతర ప్రముఖులకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మహా ప్రసాదాన్ని అంద‌జేసింది.. ఈ ప్రసాదాన్ని పూర్తిగా నెయ్యి, ఐదు రకాల డ్రై ఫ్రూట్స్, చక్కెర, గ్రామ్ ఫ్లోర్‌లతో చేశారు. మహా ప్రసాదాలను ప్రత్యేకమైన కిట్ లో ఉంచి పంపిణీ చేశారు.. అలాగే . అందులో సరియూ నదీ నీటితో నింపిన ఓ చిన్న బాటిల్ ,ఎరుపు రంగులోని పత్తి వత్తి, అక్షింతలు కూడా ప్ర‌సాద కిట్ లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement