Saturday, March 2, 2024

ఆ హాలీవుడ్ స్టార్స్ ని క‌ల‌వాల‌ని ఉంది.. రామ్ చ‌ర‌ణ్

ఆస్కార్ వేడుక‌ల‌కోసం అమెరికా వెళ్లింది ఆర్ ఆర్ ఆర్ టీం. కాగా ఈ వేడుక‌ల్లో త‌న‌కు ఇష్ట‌మైన హాలీవుడ్ ఫిల్మ్ స్టార్స్‌తో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భేటీ కావాల‌నుకుంటున్నారు. ఆస్కార్స్ రెడ్‌కార్పెట్‌కు ఎలా వెళ్తానో తెలియ‌దు కానీ.. ఆ మెగా ఈవెంట్‌కు హాజ‌రుకావాల‌న్న ఉత్సాహం త‌న‌లో ఉన్న‌ట్లు రామ్‌చ‌ర‌ణ్ తెలిపారు. ఈ వేడుక‌ల్లో ఎవ‌ర్ని క‌ల‌వాల‌నుకుంటున్న‌ట్లు అడిగిన ఓ ప్ర‌శ్న‌కు రామ్ సమాధానం ఇచ్చారు. హాలీవుడ్ స్టార్స్ సినిమాల‌ను చూస్తూ ఎదిగాన‌ని, అయితే న‌టి కేట్ బ్లాంకెట్‌, న‌టుడు టామ్ క్రూజ్ ల‌ను ఈ వేడుక వేళ ప్ర‌త్యేకంగా క‌ల‌వాల‌నుకుంటున్న‌ట్లు చెప్పారు. గ‌త ఏడాది రిలీజైన టాప్‌గ‌న్ మూవీలో టామ్ క్రూజ్ న‌టించిన విష‌యం తెలిసిందే. ఆ ఫిల్మ్‌ను చూశాన‌ని, క్రూజ్ న‌ట‌న అద్భుత‌మ‌న్నారు. మ‌రి చ‌ర‌ణ్ కోరిక నెర‌వేరుతుందో లేదో కొద్ది రోజుల్లో తెలియ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement