Tuesday, May 30, 2023

అన్నమయ్య కీర్తనలు : అణురేణు పరిపూర్ణ

రాగం : షణ్ముఖ ప్రియ

ప|| అణురేణు పరిపూర్ణమైన రూపము
ఆణిమాది సిరి అంజనాద్రి మీది రూపము ||

- Advertisement -
   

చ|| వేదాంతవేత్తలెల్లా వెదకేటి రూపము
ఆదినంత్యములేని ఆ రూపము
పాదు యోగీంద్రులు భావించురూపము
ఈ దశనిదివో కోనేటిదరి రూపము ||

చ|| పాలజలనిధిలోన బవళించే రూపము
కాలసూర్యచంద్రాగ్ని గల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదే శేషగిరిమీది రూపము ||

చ|| ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము
కొంచని మఱ్ఱాకు మీదు గొనరూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
ఎంచగ శ్రీ వేంకటాద్రి నిదెరూపము ||

Advertisement

తాజా వార్తలు

Advertisement