Friday, May 3, 2024

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో స‌న్ రైజ‌ర్స్ ఘోర పరాజ‌యం

స‌న్ రైజ‌ర్స్ ఇటు బ్యాటింగ్ లోనూ, అటు బౌలింగ్ లోనూ విఫ‌ల‌మై ఘోర ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విసిరిన 204 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 131 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.. దీంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 72 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.. ఆఖ‌రి రెండు ఓవ‌ర్ల‌లో ఎస్ ఆర్ హెచ్ సూప‌ర్ ఫాస్ట్ బౌల‌ర్ ఉమ్రాన్ మాలిక్ బ్యాటింగ్ లో దుమ్ముదులిపాడు.. 9 బంతుల‌ను ఎదుర్కొన్న ఉమ్రాన్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో 19 ప‌రుగులు పిండుకున్నాడు.. అబ్దుల్ స‌మ‌ద్ 32 ప‌రుగుల‌తో నాటాట్ గా నిలిచాడు.. ఉమ్రాన్, స‌మ‌ద్ ఇద్ద‌రూ కూడా జ‌మ్మూ కాశ్మీర్ ప్లేయ‌ర్స్ కావ‌డం విశేషం.. ఇక‌ భువ‌నేశ్వ‌ర్ రూపంలో ఎనిమిదో వికెట్ ను కోల్పొయింది.. ఈ వికెట్ య‌జువేంద్ర చావ‌ల్ కు ల‌భించింది. చావ‌ల్ త‌న 4 ఓవ‌ర్ల కోటాలో 17 ప‌రుగులిచ్చి నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. భువి 6 ప‌రుగులు చేశాడు . తొలి ఓవ‌ర్లోనే రెండు వికెట్లు కోల్పోయిన ఎస్ ఆర్ హెచ్ ఆ త‌ర్వాత ఏ ద‌శ‌లోనూ కోలుకోలేక‌పోయింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ భారీ స్కోర్ చేసింది.. నిర్ధారిత 20 ఓవ‌ర్ల‌లో అయిదు వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది.. గెలుపు కోసం స‌న్ రైజ‌ర్స్ 204 పరుగులు చేయ‌వ‌ల‌సి ఉంది.. ఇక ఏడు వికెట్ రూపంలో రషిద్ అవుట‌య్యాడు..ఈ వికెట్ య‌జువేంద్ర చావ‌ల్ కు ల‌భించింది.. అదిల్ 18 ప‌రుగులు చేశాడు. మ‌యాంక్ అగ‌ర్వాల్ ను ఆరో వికెట్ రూపంలో య‌జువేంద్ర ప‌డ‌గొట్టాడు.. మ‌యాంక్ 27 ప‌రుగులు చేశాడు.. ఇక అయిదో వికెట్ గ. గ్లెన్ ఫిలిప్స్ ను అశ్వీన్ అవుట్ చేశాడు.. ఫిలిప్స్ కేవలం 8పరుగులు చేశాడు . ఇక నాలుగో వికెట్ రూపంలో వాషింగ్ట‌న్ సుంద‌ర్ ను జాస‌న్ హోల్డ‌ర్ అవుట్ చేశాడు. అంతుకు ముందు హ్యారీ బ్రూక్ 13 ప‌రుగులు చేసి యుజువేంద్ర చావ‌ల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు..ఇక ఓపెన‌ర్ అభిషేక్ ను, వ‌న్ డౌన్ బ్యాట్స్ మెన్ రాహుల్ త్రిఫాఠిని తొలి ఓవ‌ర్ లోనే బౌల్ట్ పెవిలియన్ కు చేర్చాడు.. ఇక రాజస్థాన్ బౌలింగ్ లో బౌల్ట్ 21 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టగా, యజువేంద్ర చావల్ కు నాలుగు వికెట్లు లభించాయి.. రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్ కు ఒక్కో వికెట్ దక్కాయి.

కాగా, రాజ‌స్థాన్ బ్యాటింగ్ లో స్కిప‌ర్ సంజు శాంస‌న్ 55 ప‌రుగులు చేసి న‌ట‌రాజ‌న్ బౌలింగ్ లో అయిదో వికెట్ గా వెనుతిరిగాడు… ఇందులో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్ లు ఉన్నాయి.. ఇక అంత‌కు ముందు రియాగ్ పరాగ్ ఏడు ప‌రుగులు చేసి న‌ట‌రాజ్ బౌలింగ్ లో ఔట‌య్యాడు.. దేవ‌ద‌త్త ప‌డిక్క‌ట్ మూడో వికెట్ రూపంలో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో ఔట‌య్యాడు.. ప‌డిక్క‌ల్ కేవ‌లం 2న ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.. అలాగే ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైశ్వాల్ 54 పరుగులు చేసి ఫారూఖీ బౌలింగ్ లో ఔటయ్యారు.. కాగా జైశ్వాల్ ఈ సీజ‌న్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే 34 బంతుల‌లో 50 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు.. ఈ ప‌రుగుల‌లో8 ఫోర్లు ఉన్నాయి. ఇక‌ బట్లర్ రూపంలో తొలి వికెట్ కొల్పోయింది.. బట్లర్ వికెట్ ను ఫరూఖీ పడగొట్టారు.. బట్లర్ 22 బంతులలో 54 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, నాలుగు సిక్స్ లు ఉన్నాయి. అశ్వీన్ 3 , హెట్మెయిర్ 22 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు.. న‌ట‌రాజన్, ఫారూఖీ రెండేసి వికెట్లు తీసుకోగా, ఉమ్రాన్ మాలిక్ కు ఒక వికెట్ ద‌క్కింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement