Saturday, May 18, 2024

Raigad మ‌హారాష్ట్ర‌లో కుప్ప‌కూలిన హెలికాఫ్ట‌ర్..

శివ‌సేన నేత సుష్మా అధారేకు త‌ప్పిన ప్ర‌మాదం
ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం అభ్య‌ర్ధిని తీసుకెళ్లేందుకు
వ‌స్తున్న స‌మ‌యంలో ప్ర‌మాదం
అందులోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న పైలెట్

రాయ్‌గ‌డ్‌: మ‌హారాష్ట్ర‌లో ఓ ప్రైవేటు హెలికాప్ట‌ర్ కూలింది. ఈ ఘ‌ట‌న రాయ్‌గ‌డ్ జిల్లాలోని మ‌హ‌ద్ ప‌ట్ట‌ణంలో జ‌రిగింది. శివ‌సేన డిప్యూటీ నేత సుష్మా అధారే ఆ హెలికాప్టర్‌లో ప్ర‌యాణించాల్సి ఉంది. ఆ నేత‌ను తీసుకువెళ్లేందుకు వ‌స్తున్న హెలికాప్ట‌ర్‌.. ల్యాండింగ్ స‌మ‌యంలో కుప్ప‌కూలింది.

ల్యాండింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆ హెలికాప్ట‌ర్ అటూ ఇటూ ఊగింది. బ్యాలెన్స్ త‌ప్పింది. ఆ హెలికాప్ట‌ర్‌ను అదుపు చేసేందుకు పైలెట్ ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా పోయింది. ఖాళీ మైదానంలో ఆ హెలికాప్ట‌ర్ ఒక్క‌సారిగా భారీ శ‌బ్ధం చేస్తూ కూలింది. కూలుతున్న స‌మ‌యంలో ఆ హెలికాప్ట‌ర్ నుంచి పైలెట్ కింద‌కు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement