Saturday, March 2, 2024

Rajasthan – విద్యుత్‌ షాక్‌ తో నలుగురు దుర్మరణం

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా విద్యుత్‌ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు.. వివరాలలోకి వెళ్తే.. గురువారం రాత్రి రాజస్థాన్ రాష్ట్రం లోని సలాంబర్ జిల్లా లోని లసాదియా ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఇది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement