Wednesday, May 1, 2024

దక్షిణ కోస్తాలో మూడు రోజులు వర్షాలు.. పెరగనున్న చలి తీవ్రత

అమరావతి, ఆంధ్రప్రభ: వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి వాయువ్యదిశగా పయనిస్తూ గురువారం వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. అనంతరం ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్‌ ప్రాంతంవైపు పయనించే అవకాశం ఉందని సూచించారు.

ఈనేపథ్యంలో మూడు రోజులపాటు తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కూడా ఉంటుందన్నారు. ఈనెల 24వ తేదీ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తరకోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement