Sunday, May 5, 2024

భార్య‌న‌గ‌రంలో ప‌లు చోట్ల వ‌ర్షం.. చ‌ల్ల‌బ‌డిన వాతావ‌ర‌ణం

క‌ర్ణాట‌క నుంచి ఉప‌రిత‌ల ద్రోణి ప్ర‌భావంతో తెలంగాణలో రుతుప‌వ‌నాలు చురుకుగా క‌దులుతున్నాయి. రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి మండే ఎండలతో భగ్గుమనిపించిన భానుడు.. ఒక్కసారిగా కూల్​ అయ్యాడు. మ‌ధ్యాహ్నం 2 గంటలదాకా భగభగమన్న వాతావరణం.. ఒక్కసారిగా చల్లబడింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు ఇవ్వాల (ఆదివారం) హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురిశాయి. జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, పంజాగుట్ట‌, అబిడ్స్, అమీర్‌పేట‌, మూసాపేట‌, కూక‌ట్ ప‌ల్లి, ఖైర‌తాబాద్‌, కోఠీ, నాంప‌ల్లి, మాదాపూర్‌, గ‌చ్చిబౌలి, చందాన‌గ‌ర్‌, మియాపూర్‌, ఎల్సీన‌గ‌ర్‌, వ‌న‌స్థ‌లీపురం, బీఎన్ రెడ్డిన‌గ‌ర్‌, హ‌య‌త్ న‌గ‌ర్‌, అబ్దుల్లామెట్‌, పెద్ద అంబ‌ర్‌పేట్, నాచారం, హ‌బ్సిగూడ‌, ఉప్ప‌ల్, బోడుప్ప‌ల్, రామంతాపూర్, మ‌ల్లాపూర్, చింత‌ల్, గాజుల రామాయంలో వ‌ర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. పలు చోట్ల ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. అయితే చల్లబడ్డ వాతావరణంతో సిటీ జనం కాస్త ఊరటపొందుతున్నారు. కూల్​ వెదర్​ని ఎంజాయ్​ చేస్తూ సేద తీరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement